అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం..
అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాల ప్రభావంతో నేడు ఫారెక్స్ మార్కెట్ (Forex Market) లో అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి (Indian Rupee) మారకం విలువ బలపడింది. అమెరికా, ఇరాన్ (USA, Iran) మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు పతనం కావడంతో రూపాయి ఏకంగా 58 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 94.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన రూపాయి.. ఆ తర్వాత మరింత పుంజుకుని 94.60 వద్ద స్థిరపడింది. గత సెషన్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.18 వద్ద ముగిసింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ శాంతి...