రాయన్‌పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి

మెదక్ మండలంలోని రాయన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెదక్‌ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రాయన్‌పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలోని దోని కొట్టుకుపోయిందని తెలిపారు. దీంతో ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, అయితే సంవత్సరం...