విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న పాఠశాల- అందులో చదివిన 200 మందికి గవర్నమెంట్ జాబ్స్
ఎక్కడైనా ప్రభుత్వం స్కూల్ ఏర్పాటు చేస్తే అక్కడ విద్యార్థులు చదువుకుంటారు. లేదంటే ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. అయితే బిహార్ రాష్ట్రం గయా జిల్లాలో ఉన్న ఒకప్పటి నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఇమామ్‌గంజ్‌లో పరిస్థితి వేరు. అక్కడ విద్యార్థులే సొంతంగా స్కూల్ ఏర్పాటు చేసుకుని అందులోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆపై మంచి ఉద్యోగాలను సంపాదించుకుని జీవితంలో స్థిరపడ్డారు. స్కూల్ ఏర్పాటు చేసుకున్న స్టూడెంట్స్ ఇమామ్‌గంజ్‌లో 1990లో హైస్కూల్ ఉండేది కాదు. స్థానిక ప్రముఖులు, అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇమామ్‌గంజ్ బ్లాక్‌కు చెందిన రామ్‌స్వరూప్ యాదవ్, కృష్ణ మిశ్రా, బాల్‌ముకుంద్ మిశ్రా, శ్యామ్ కిశోర్ పాండే,...