పెరిగిన బంగారం, వెండి ధరలు- జూన్ 15న తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించేలా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో చమురు ధరలు దిగిరావడం, రూపాయి విలువ బలోపేతం కావడం వల్ల ఈ లోహాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,55,470గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుతో పాటు బెంగళూరు, ముంబయి మార్కెట్లలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,640గా నమోదైంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలు స్వల్ప వ్యత్యాసాలతో కొనసాగుతున్నాయి. చెన్నైలో...