పార్టీ అభివృద్ధి కొరకు అంకితభావంతో పనిచేస్తా పదవుల కొరకు కాదు
- నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్.సలీం నారాయణపేట జిల్లా, జూన్ 14( బి వి కే న్యూస్ ) గత రెండు సంవత్సరాలుగా నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించే అరుదైన అవకాశం నాకు కల్పించిన పార్టీ అధిష్టానానికి మరియు గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ. వాకిటి.శ్రీహరి గారికి, గౌరవ శ్రీ.డాక్టర్.చిట్టెం. పర్ణిక రెడ్డి గారికి,మరియు నన్ను రాజకీయంగా ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకొచ్చిన నా గురువు,మాబాస్ గౌరవ శ్రీ.కుంభం. శివకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు నారాయణపేట పట్టణ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ సలీం. ఈ బాధ్యతను నేను ఒక పదవిగా...