సమస్యల సుడి గుండంలో "వృద్ధ భారత్"

(వృద్ధుల రక్షణకు చట్టాలే సాథనం) మానవ సమాజంలో అనుభవం ' జ్ఞానం ' వారసత్వ సంపదను' సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే సమూహమే వృద్ధులు . మన దేశములో 60 యేళ్లు పైబడిన వారిని వృద్ధులు/ సీనియర్ సిటిజన్స్ అంటారు. మానవ జీవితంలో వృద్ధాప్యం అనివార్యమైన తప్పించుకోలేని దశ .ఈ వాస్తవాన్ని విస్మరించి అనేక కుటుంబాలు సమాజం వృద్ధులను భారంగా భావిస్తూ అనేక రకాలుగా వేధిస్తున్నారు. వృద్ధులు వేదింపులు సామాజిక వేత్తల ఆందోళన వృద్ధుల పై వేధింపులు ప్రపంచ వ్యాప్త సమస్య .అభివృద్ధి చెందిన 'అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల అనాదరణ 'వేదింపులు వారిపై జరుగుతున్న పలురకాల హింస జటిల సామాజిక సమస్యగా పరిణమించిందని సామాజిక...