విజ్ఞానాన్ని స్వచ్ఛందంగా ఆస్వాదిస్తేనే విజేతలుగా నిలుస్తారు - లయన్ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు
కౌమార యువతలో పాఠ్యాంశాలతో పాటు సరైన ఆధునిక జీవన నైపుణ్యాలు పెంపొందిస్తేనే విజ్ఞాన వివేక సమపన్నులు అవుతూ రేపటి భారతదేశానికి సమర్థవంతమైన నాయకత్వం అందిస్తారని లయన్ జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరామ్ అన్నారు. ఈ రోజు స్థానిక సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీన్ ఏజ్ యువతలో సామాజిక భావోద్వేగాలను నియంత్రిస్తూ దానికి అనుగుణంగా వారి మానసిక స్థాయిని సరైన పద్ధతిలో మార్గదర్శనం చేయడానికి లయన్స్ క్వెస్ట్ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కౌమార యువతలో వ్యక్తిగత...