మక్తల్ లో ఘనంగా దయాకర్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు
- దయాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు - ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ నారాయణపేట జిల్లా, జూన్ 13 (బివికే న్యూస్) నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో స్వర్గీయ కొత్తకోట దయాకర్ రెడ్డి మూడవ వర్ధంతి వేడుకలను మక్తల్ లోని నారాయణపేట చౌరస్తాలో గల ఆయన నివాసంలో పెద్ద ఎత్తున అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, నాయకులు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. దయాకర్ రెడ్డి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి...