ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన సందర్భంగా దత్తాత్రేయ మందిరంలో ప్రత్యేక పూజలు

నారాయణపేట జిల్లా, జూన్ 13 (బివికే న్యూస్) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా మక్తల్ మండలం మంతన్ గోడు గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శనివారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బలరామిరెడ్డి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ పాలన ఎంతో అవసరమై కొనియాడారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలు కంటి నిండా నిద్రపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఎం ప్రతాపరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జి బలరాం రెడ్డి ఉపాధ్యక్షులు కర్నే స్వామి మాజీ...