ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం వేడుకలు
- సైకిల్ ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు నారాయణపేట జిల్లా, జూన్ 13 (బివికే న్యూస్) సైకిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖే లో ఇండియా, తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ నుండి పురవీధుల గుండా ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీని మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, సైకలింగ్ అసోసియేషన్ చైర్మన్ మణికంఠ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలంలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరము...