వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమ‌లు చేయాల‌ని త‌ల‌పెట్టిన వీబీజీ రాంజీ స్కీం ప‌ట్ల నిర‌స‌న తెల‌పాల‌ని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) పేర్కొన్నారు. త‌మ నిర‌స‌న తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. వీబీజీ రాంజీ స్కీంను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మాణం చేశామని ప్రస్తావించారు. ఈ లేఖ‌లో పొందుప‌ర్చాల్సిన అంశాల‌పై పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెష‌ల్ సీఎస్, క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజ‌న్, స్పెష‌ల్ క‌మిష‌నర్ శ్రీల‌క్ష్మీ, జాయింట్ క‌మిష‌న‌ర్ న‌ర‌సింహులు, ఇత‌ర అధికారుల‌తో ప్రజాభ‌వ‌న్‌లో మంత్రి సీత‌క్క ఈరోజు (శనివారం) స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి...