మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

హైదరాబాద్, జూన్ 13: మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నియంత దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌పై కేసు ఏమీ లేదని.. నోటీసు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారని ఆరోపించారు. గాంధేయవాది, నిజాయతీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్ అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆఫీసు కల్పించుకుని కేసును తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఈ విషయంలో ఉరి వేసినా తప్పులేదన్నారు. ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టులో...