ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్
హైదరాబాద్, జూన్ 13 : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను ఈరోజు(శనివారం) అధికారులు రికార్డ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తులో భాగంగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు సిట్ బృందం ఆయన నివాసానికి వెళ్లి వివరణ తీసుకుని స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై జరుగుతున్న విచారణలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సిట్...