టైరోడ్లో ఘనంగా దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మూడవ వర్ధంతి వేడుకలు
- ఘన నివాళులు అర్పించిన అభిమానులు నారాయణపేట జిల్లా, జూన్ 13 బివికే( న్యూస్) దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి వర్ధంతి వేడుకలను శనివారం కృష్ణ మండల పరిధిలోని టైరోడ్ కూడలిలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్తకోట దయాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దయాకర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్యం, త్రాగునీరు, రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటి కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.