కారులో యువతిని తీసుకెళ్లి నిద్రమాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించిన యువకుడు - స్పృహ కోల్పొయాక ఊపిరాడకుండా చేసి హత్య - మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన నిందితులు

మన్యం జిల్లా పాలకొండ మండలం బర్నసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి(32) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితుడు ఎం.సింగుపురం గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ రెడ్డి భువనేశ్వర్ అని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ కేసు వివరాలను ఆయన పాలకొండలో వెల్లడించారు. 'ఉషారాణి గత ప్రభుత్వంలో వాలంటీర్గా పని చేసిన సమయంలో భువనేశ్వర్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే కాంట్రాక్టు స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న వివాహిత తీగల కృపారాణితో నిందితుడు భువనేశ్వర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమించిన యువతితో వివాహాన్ని జాప్యం చేస్తూ వచ్చాడు....