రక్షణ భద్రతలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరిన భారత్‌- బహుళ స్థాయి బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రదర్శించిన డీఆర్‌డీఓ

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) సరికొత్త రికార్డు సృష్టించింది. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ రెండు రోజుల్లో వరుసగా మూడు కీలక క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 10, 11 తేదీల్లో మల్టీ లేయర్‌ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రయోగించింది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం వీటికి ఉంది. అత్యాధునిక రక్షణ సాంకేతికతలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పాయి.