భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు తాత్కాలిక బ్రేక్..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కి సంబంధించిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్‌లో మరోసారి ఆలస్యం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సేవల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది.ఇటీవల ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ టెర్మినల్స్ వినియోగంపై వచ్చిన నివేదికలు భారత భద్రతా సంస్థల్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత, సార్వభౌమాధికారం, నిఘా వ్యవస్థల పరిరక్షణకు సంబంధించి స్టార్‌లింక్ పూర్తిస్థాయిలో భారత నిబంధనలకు కట్టుబడి ఉంటుందా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. విదేశీ ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్ల...