ఒత్తిడిని తగ్గించే బ్రహ్మాస్త్రం యోగాస్త్రం

(జూన్21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాసిన కవిత) ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోతున్న మనసు కోసం ఒత్తిడిని దూరం చేసే అస్త్రం మన ప్రాచీన యోగాస్త్రం జూన్ 21వ తేదీన ప్రపంచ మంతా జరుపుకునే పండుగ జాతి మత ప్రాంతం భేదం లేనిది ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒత్తిడిని ఆందోళనలను తగ్గించే దివ్యమైన బ్రహ్మాస్త్రం యోగాస్త్రం చిరునవ్వును మరవని మనిషి జీవితంలో తెలియని అలసట నింపే ఈ హైటెక్ కాలంలో సమస్యల సుడిగుండంలో చిక్కిన మనసుకు యోగాసనమే కదా ఒక దివ్యమైన ప్రకృతి చికిత్స సమస్త రోగాలను హరించే దివ్యాస్త్రం ఈయోగాస్త్రం అలసిన మదికి అమృతం యోగ కలతనుతీర్చే దివ్య ఔషధం యోగ...