విద్యాశాఖలో 2 వేల కోట్ల కుంభకోణం
హైదరాబాద్,: గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో విద్యాశాఖలో రూ.2000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే పాఠశాలల పునఃప్రారంభం వాయిదా వేశారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు, షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని లిడ్ క్యాప్‌కు ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వాటిని సెంట్రలైజ్ చేసి.. గుజరాత్ కాంట్రాక్టర్‌కు అప్పగించారని మండిపడ్డారు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదని, 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, పుస్తకాలు ఏవీ అందలేదన్నారు. అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం...