కలశం చెంబులో తాళం పెట్టడం వల్లే.. 7.8 కిలోల బంగారం, కిలోన్నర వెండిని సులువుగా దోచేసిన దొంగలు!
ఇంట్లో ఎంత పటిష్టమైన భద్రతా లాకర్లు ఉన్నా, చిన్నపాటి నిర్లక్ష్యం వహిస్తే.. ఎంతటి ముప్పు తెస్తుందో నిరూపించే ఘటన గచ్చిబౌలిలో జరిగింది. ముఖ్యంగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ విల్లాలో 7.8 కిలోల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి చోరీకి గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే నిందిలను పోలీసులు అరెస్ట్ చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కోట్లాది రూపాయల సంపదను దాచుకోవడానికి అనేక లాకర్లను ఏర్పాటు చేసుకున్నసదరు వ్యాపారవేత్త.. దానికి సంబంధించిన తాళం చెవిని మాత్రం పక్కనే ఉన్న పూజా కలశం చెంబులో దాచాడు. అదే అతడి కొంప ముంచింది. పని మినిషులు సులువగా బంగారం దోచేసేందుకు...