రెండేళ్లలో భారీగా పెట్టుబడులు సాధించాం - నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు
సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందుచూపుతో కూడిన ఆర్థిక అజెండా ఇవన్నీ పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే గత రెండేళ్లలో తమ రాష్ట్రం 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని స్పష్టం చేశారు. ఇవి ఏపీలో భారీ మొత్తంలో ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర దీర్ఘకాల ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రాష్ట్రపతిభవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ 11వ పాలకమండలి సమావేశంలో ప్రసంగించిన సీఎం వివిధ అంశాలను ప్రస్తావించారు. నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు (ETV Bharat) కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌తో కలిసి పనిచేస్తాం: నీతి ఆయోగ్...