ఏపీలో ప్రజా ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి - సేవకులుగా పనిచేస్తున్నామన్న సీఎం చంద్రబాబు!

రాష్ట్రంలో 'ప్రజా ప్రభుత్వం' కొలువుదీరి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమపై పెట్టుకున్న అపారమైన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వదిలివెళ్లిన సంక్షోభాలు, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. వాటన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూలస్తంభాలతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అధికారం కాదు, అది...