రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి, జూన్ 12: గొడ్డలి ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లలో గాడిన పెట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అమలు చేసిన ట్రూ అప్ విధానాన్ని ట్రూ డౌన్ చేసి చరిత్ర సృష్టించామన్నారు. గత రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పారు. వచ్చే మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ధైర్యంగా చెబుతున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.విద్యుత్ ఛార్జీలు తగ్గించి 13 పైసలు ట్రూ డౌన్ దిశగా చేసిన ఏకైక ప్రభుత్వం తమది అని మంత్రి చెప్పుకొచ్చారు....