12 నుంచి 4కు దిగిన గ్యాస్​ సిలిండర్లు - మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేనా?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ముఖ్యంగా భారత్​లో వంటగ్యాస్​ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు సామాన్యుల మెడకు గుదిబండగా మారాయి. వీటన్నింటికీ తోడు ప్రస్తుతం సిలిండర్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీపై తొమ్మిది సిలిండర్లు ఇస్తుండేది. ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగుకు కుదించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది! పేదలకు భరోసాగా ఉజ్వల పథకం : మోదీ ప్రభుత్వంలోకి వచ్చాక పేద ప్రజలకు భరోసాగా 2016లో కేంద్రం ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. వంటింట్లో కట్టెల పొయ్యితో...