డిజిటల్ ఏఐ‌ యుగంలో కూడా బాలకార్మిక దురాచారమా

12 జూన్‌ “ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం” సందర్భంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్వచనం ప్రకారం, బాలల్ని ఉపాధులు లేదా ఉద్యోగాల ఉచ్చులో బంధించి వారి బాల్యాన్ని, శక్తియుక్తులను, గౌరవాన్ని, సంపూర్ణ ఎదుగుదలను, శారీరక మానసిక ఆరోగ్యాన్ని హరింపజేసే లేదా నలిపి వేసే ప్రయత్నాలను బాల కార్మిక వ్యవస్థ అని అంటాం. అంతర్జాతీయ, జాతీయ చట్టాలు, నియమనిబంధనలకు వ్యతిరేకంగా పిల్లలను (5 నుంచి 17 ఏండ్ల లోపు) కార్మికులుగా మార్చి వారి బంగారు భవితను బుగ్గిపాలు చేయడాన్ని బాల కార్మిక దురాచారం అని అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నేటికీ 160 మిలియన్ల బాల కార్మికుల బతుకులు ఉపాధుల పేరుతో బుగ్గిపాలు అవుతున్నాయి. వీరిలో వయస్సు...