పీసా చట్టం.. ఆదివాసీల నిర్ణయాధికారానికి రక్షణ కవచం: మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 10: పీసా చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. గ్రామసభలను బలోపేతం చేసి గిరిజన హక్కులను కాపాడాలన్నారు. ఈరోజు(బుధవారం) రాజేంద్రనగర్‌లో పీసా చట్టం అమలుపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించి... ప్రసంగించారు. పీసా చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పూర్తి అవగాహన అవసరమని తెలిపారు. పీసా కేవలం చట్టం కాదని.. ఆదివాసీల స్వయం నిర్ణయాధికారానికి రక్షణ కవచమని వెల్లడించారు. పేద వారి కోసం పనిచేయడమే ప్రజాసేవ.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని.. గ్రామసభలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని మంత్రి తెలిపారు. సహజ వనరులపై గ్రామసభల నిర్ణయాధికారాన్ని పీసా చట్టం కల్పించిందన్నారు. చట్టం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని...