ఓ మనిషి
జీవితం పైన పటారం ______________________ లోన లోటారం ________________________ జీవితం అందంగా ఆనందంగా ఉండదు సుఖ దుఃఖాలు కష్టాలు కన్నీళ్లు ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడు సుడిగుండాల్లో చిక్కుకొని ఆందోళనల ఊబీలో బిక్కు బిక్కుమని పరుల సహకారానికి ఎదురుచూస్తుంది మరిచిపోలేని మనుషులు మరుద్దామన్న మరిచి పోలేని మనుషుల మాటలుచేష్టలు వదులుకోలేని బంధాలు తెగిపోతున్న అను బంధాలు అహం పేరిట విచ్చిన్నమౌతున్న సంసారాలు పగ కక్షలకు వేదికలై ప్రతీకార సంస్కృతికి ఆజ్యం పోస్తున్నాయి కుటుంబ హింస పెరుగుతుంది తెగిపోతున్న కుటుంబ బంధాలు ఆస్తులవేటలో జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు పెరిగి ఆత్మీయత అనురాగాలు తగ్గుతున్నాయి మోసం కుట్రలు బంధువుల జీవితంలో అంతర్బాగాలైనాయి అహంకారం ఆధిపత్యం పెరిగి మనిషి పతనానికి...