బాల్యంలో శారీరక, మానసిక వికాసానికి ఆటలు తప్పనిసరి !

(11 జూన్‌ “అంతర్జాతీయ ఆటల దినోత్సవం” సందర్భంగా) ఆటలు పిల్లల జన్మ హక్కు. బాల్యం ఆటలకు నెలవు. ఆటల్లో ఆనందాన్ని పొందడం చిన్నారులకు ఇష్టమైన ఏకైక దినచర్య. పిల్లలు, పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు, యువత తప్పక ఆటలకు కొంత సమయాన్ని కేటాయించాలి. ఆటలతో అనేక ప్రత్యక్ష ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఆటలు దోహదపడతాయి. చిన్నారుల్లో సృజనశీలత పెంచడం, సామాజిక నైపుణ్యాలను వృద్ధి చేయడం, ప్రపంచ పోకడల గూర్చి అవగాహన పరుచుకోవడం ఆటలతో సుసాధ్యం అవుతుంది. ఆటల ద్వారా పిల్లలు తమ బావోద్వేగాలను వ్యక్తం చేయడం, నిలకడను అలవర్చుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, అమిత సంతోషాలను పొందడం జరుగుతుంది. ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా...