కుమ్మర (శాలివాహన) వృత్తి దారుల ఆరోగ్య భద్రత కొరకు ప్రత్యేక ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
తెలంగాణ రాష్ట్రములో దాదాపు 5లక్షల జనాభా కలిగిన కుమ్మర్లు రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడినవారు. సంప్రదాయ వృత్తిని నమ్ముకొన్న కష్టజీవులు. మట్టిని నమ్ముకొని కుమ్మర వృత్తిపై జీవిస్తున్న వృత్తిదారుల జీవన భద్రతకు సంబంధించిన ప్రమాద బీమా పథకాన్నీ ప్రభుత్వం అమలుచేయాలి. కుమ్మర వృత్తి _ ప్రజారోగ్యం పర్యావరణ పరిరక్షణ సమాజంలో ప్రజారోగ్యానికి దోహధపడే మట్టి పాత్రలు కుండలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. మట్టి పాత్రలను ఉత్పత్తి చేస్తూ భారత దేశ నాగరికత వారసత్వాన్నిరక్షిస్తున్నారు.హిందూ పండుగల్లో బోనాలు పూజకు కావలసిన ప్రతిమలు తయారు చేస్తూ దేశసంస్కృతిని కాపాడుతున్న కుమ్మర వృత్తి కార్మికులు అనేక రకాల ప్రాణ పాయ ఆరోగ్య ప్రమాదాల అంచున జీవిస్తున్నారు....