ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి

తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని స్పష్టంచేశారు. దేశవ్యాప్త ధాన్యం సేకరణలో దాదాపు 50 శాతం తెలంగాణ నుంచే జరిగినప్పటికీ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కనబెట్టి, వాస్తవాలను దాచిపెడుతూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇదే క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,...