152 పరుగులకు ఆలౌట్ అయిన ఆప్గనిస్తాన్ ..6 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్
హైదరాబాద్ : న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) తొలి ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో ఆప్గనిస్తాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఆప్గాన్ 152 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రహ్మత్ షా(60) ఒక్కడే రాణించాడు. ప్రసిద్ధ్ క్రిష్ణ 3వికెట్లు తీసుకోగా వాషింగ్టన్ సుందన్ ఒక వికెట్ తీశాడు. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆప్గాన్‌ను ఇండియా ఫాల్‌ఆన్‌కు ఆహ్వానించింది. 412 పరుగుల లోటుతో సెకండ్ ఇన్సింగ్స్ ఆరంభించిన ఆ జట్టు 4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 18 పరుగులు చేసింది