నెతన్యాహుకు వేరే ఛాన్స్‌ లేదు.. ఇరాన్‌తో ఒప్పందానికి అంగీకరించాల్సిందే :

ఇరాన్, ఇజ్రాయెల్ (Iran, Israel) దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని ట్రంప్ చెప్పారు. ఇక్కడ తానే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని, నెతన్యాహు (Nethanyahu) కాదని అన్నారు. భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరే ఒప్పందాన్ని ఆయన అంగీకరించి తీరాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ఇజ్రాయెల్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అంతకుముందు లెబనాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ...