విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..
హైదరాబాద్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా జూన్ నెలంతా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు నేడు (ఆదివారం) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టులు, నీటి పారుదల రంగంపై నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై టీవీ డిబేట్స్, ఇతర వేదికలపై మాట్లాడేలా నేతలకు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంచందర్ రావు హాజరుకాగా.. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్...