పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ మందపల్లి, జూన్ 2026: మందపల్లి జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో 2002-2003 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 23 ఏళ్ల అనంతరం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించి తమ జీవితాల్లో వారి పాత్రను గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమ్మేళనాలు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరేందర్ రెడ్డి సార్ హాజరై మాట్లాడుతూ, విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం నిలిచిపోతాయని అన్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు...