పాలమూరు- రంగారెడ్డికి కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది.. సీఎం రేవంత్‌పై లక్ష్మారెడ్డి ఫైర్

రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని అన్నారు. ఇప్పుడు అకస్మా్త్తుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్‌కు ప్రేమ పుట్టిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లపాటు పాలమూరు-రంగారెడ్డిని పడావు పెట్టిందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వలేనే సోయి లేదని అన్నారు. 10 శాతం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం...