‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనం.. బుక్‌మైషోలో 40 వేల మార్క్ దాటిన నాలుగో తెలుగు చిత్రంగా రికార్డు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విడుదలకు ముందే సినిమాపై నెలకొన్న హైప్‌కు నిదర్శనంగా బుక్‌మైషోలో నమోదైన టికెట్ అమ్మకాలు నిలిచాయి. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం ద్వారా ‘పెద్ది’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో బుక్‌మైషో అవర్లీ ట్రెండింగ్ చరిత్రలో 40 వేల...