షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, క్రికెటర్ షాహిద్ అప్రిదిమృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఓ ఫేక్ పోస్టు వైరల్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. గతంలో 2005 జూన్‌లోనూ ఇదే తరహా ఫేక్ న్యూస్ వ్యాపించింది. క్రికెటర్ అఫ్రిది మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ నివాళి పోస్టర్ వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ పోస్టు వాస్తవం కాదు అని మరికొందరు ఎక్స్ అకౌంట్లలో రియాక్ట్ అయ్యారు. కరాచీలో జరిగిన తమ ఫౌండేషన్ ఓపెనింగ్ సెర్మనీలో షాహిద్ అఫ్రిది పాల్గొన్నట్లు తెలుస్తోంది. డెత్ రూమర్‌ను కొందరు నెటిజన్లు కొట్టిపారేశారు. తప్పుడు సమాచారం షేర్ చేసిన ఆ అకౌంట్ హోల్డర్‌పై చర్యలు తీసుకోవాలని...