దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

పండుగ వేళ యువత మద్యం సేవించి వాహనాలు నడపొద్దు ​- ప్రాణాల కంటే ఏదీ విలువైనది కాదు.. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని, నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి విజయదశమి ధర్మం, న్యాయం, సత్యం సాధించిన విజయానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటిచెప్పే ఈ...