కొండమల్లేపల్లిలో బతుకమ్మ ఉత్సవాలు: నిత్యం ప్రథమ బహుమతే లక్ష్యంగా... గత 14 ఏళ్లుగా అగ్రస్థానంలో పసునూరి రమాదేవి

దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : దసరా పండగ వచ్చిందంటే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎంగిలిపువ్వు బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవం ముగుస్తుంది .ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు చాలామంది బతుకమ్మను రకరకాల పూలతో అందంగా పేర్చి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అందంగా ముస్తాబై మూకుమ్మడిగా బతుకమ్మ వేడుకను నిర్వహిస్తుంటారు. ప్రతి మహిళ బతుకమ్మ వేడుకలలో పాల్గొనాలనే సంతోషం ,ప్రేమ, అభిమానం కనబరుస్తుంది. ఈ తరుణంలో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన పసునూరు రమాదేవి అనే మహిళ బతకమ్మ పై ఉన్న ప్రేమను గత 14 సంవత్సరాలుగా తెలియజేస్తూ వస్తుంది.బతుకమ్మ అంటే నాకు ప్రాణం అని మనస్ఫూర్తిగా అమ్మవారి మీద ప్రేమతో ప్రతి...