‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
పంజాబ్ సింగర్ దలేర్ మెహందీపై ఒక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సింగర్ మద్యం సేవించి పాటలు పాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఏమాత్రం తగదంటూ ఆ గాయకుడిపై మండిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా కుంజాపురి జాతరలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పంజాబ్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు దలేర్ మెహందీ తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.కాగా, ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వేదికపైకి వచ్చిన ఆయన పాడటం ఆపేయాలని దలేర్ మెహందీని...