స్ధానిక ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్..!
ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఇవాళ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కూటమి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా విపక్ష వైసీపీ నుంచి చిన్న చిన్న నాయకులను సైతం తమ పార్టీవైపు తిప్పుకుంటోంది. వారికి అభ్యర్ధిత్వాలు, పదవుల ఆశ చూపిస్తోంది. ఇలాంటి సమయంలో కూటమిని నడుపుతున్న టీడీపీకి ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణఝలక్ ఇచ్చారు.తన సొంత జిల్లా విజయనగరంలోని గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం, పరిసర ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ కు బొత్స వల విసిరారు....