‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ సునామీ..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జైలర్‌ 2’ థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల దిశగా సాగుతోంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.317.15 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది.ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జైలర్‌ 2’ తొలి వారాంతంలోనే భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి.ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ ఈ...