ఆహారాన్ని ఎక్కువ‌గా తింటూనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా..

39 ఏళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లల తల్లి, సామాజిక మాధ్యమాల ప్రభావశీలి ఎరిన్‌ స్టాన్జిక్‌ తన జీవసంబంధ వయసు 22 ఏళ్లుగా ఉందని వెల్లడించారు. ఆహార నియమాలు, వ్యాయామ పద్ధతులను తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ఆమె.. అధిక పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే తక్కువ కేలరీలు పొందే విధానాన్ని అనుసరించి 9 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు తెలిపారు. ఐదుగురు సభ్యులున్న తన కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని వారానికి సుమారు 20 రకాల ప్రధాన పదార్థాలతోనే సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆహార విధానాన్ని పాటించడం వల్ల గత 11 నెలలుగా తగ్గిన బరువును కొనసాగించగలుగుతున్నట్లు వివరించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అధిక పరిమాణం, తక్కువ...