వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి..
శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలనుకునేవారిలో ప్లయోమెట్రిక్స్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్‌ఐఐటీ) వ్యాయామాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ రెండు పద్ధతుల్లోనూ అధిక శ్రమ అవసరమవుతుంది. అయితే, ఇవి ఒకే రకమైన వ్యాయామాలు కావు. ప్లయోమెట్రిక్స్‌లో కండరాలు తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేలా వేగవంతమైన, పేలుడు స్వభావం కలిగిన కదలికలు చేస్తారు. హెచ్‌ఐఐటీలో మాత్రం కొద్దిసేపు అధిక తీవ్రతతో వ్యాయామం చేసి, ఆ తర్వాత విశ్రాంతి లేదా తక్కువ తీవ్రతతో కూడిన కదలికలు చేస్తారు. వ్యక్తి వయసు, శారీరక సామర్థ్యం, వ్యాయామ అనుభవాన్ని బట్టి ఈ రెండింటిని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏం చేయాలి.. ప్లయోమెట్రిక్స్‌లో బాక్స్ జంప్స్, స్క్వాట్ జంప్స్, ముందుకు...