డిండి రిజర్వాయర్ పరిధిలో రైతులకు విద్యుత్ కష్టాలు రాకుండా చూడాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
TGSPDCL సీఎండీని కోరిన దేవరకొండ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించిన సీఎండీ, వెంటనే ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు హామీ దేవరకొండ,16అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : డిండి రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్న రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TGSPDCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గారికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన సీఎండీ, అవసరమైన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిమాండ్ డ్రాఫ్ట్లు (DDs) చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులకు పెండింగ్లో...