కోట్ల నిరంజనమ్మ మృతి చాలా బాధాకరం :- కేతావత్ బీల్యా నాయక్
దేవరకొండ,16అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : నేరడగొమ్ము మండల కేంద్రానికి చెందిన అంగన్ వాడి టీచర్ కోట్ల నిరంజనమ్మ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని కోట్ల నిరంజనమ్మ మృత దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్.ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ ముక్కమల్ల బాలయ్య,మాజీ సర్పంచ్ ఆరేకంటి రాములు,గౌని శేఖర్,కోట్ల వెంకయ్య, వేణు, కృష్ణ,వెంకటయ్య,సైదయ్య,తదితరులు పాల్గొన్నారు.