పుంగనూరులో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
పుంగనూరు ఘటనలో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుమిల్లి వెల్లడించారు. శుక్రవారం పుంగనూరులో జిల్లా ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తిన పార్టీ శ్రేణులు తరలి వచ్చాయని తెలిపారు. ఆయన ఇంటి దగ్గర నుంచి నామినేషన్ కేంద్రం వరకు 6 వాహనాల్లో వచ్చారని వివరించారు. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ సెంటర్ లోపలికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులే వెళ్లాల్సి ఉందని అన్నారు.ఎంపీ మిథున్ రెడ్డి ఆ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు, గేట్లను ఢీకొట్టి అతి...