ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలతోపాటు అందుకు సంబంధించిన ఆధారాలను ఏపీ పోలీసుల నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. వీటి ఆధారంగా సోదాలు చేపట్టేందుకు ఆ అధికారులు సిద్ధమవుతున్నారు. 2025, ఏప్రిల్లో విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబర్10వ తేదీన మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ప్రధానంగా...