ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు
మూల నక్షత్రం నేపథ్యంలో సరస్వతీ దేవి అలంకారంలో శుక్రవారం దుర్గమ్మ వారు భక్తులకు దర్శనం ఇస్తారని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. శక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి12.30 - 12.45 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రోజు ఐదో రోజు లలితా త్రిపుర...