డీఎస్సీ-2008 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2008 ఉద్యోగాల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. జీవో నంబర్ 28ను ప్రభుత్వం సవరించిన విధానాన్ని తప్పుబడుతూ హైకోర్టులో డీఎస్సీ అభ్యర్థులు, బీఈడీ అభ్యర్థులు మూడు పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఈ మూడు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది.2008 డిసెంబర్ నాటి అసలు నోటిఫికేషన్ ప్రకారమే DSC-2008 ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నోటిఫికేషన్ విడుదలైన తరువాత జీవో నంబర్ 28ను జారీ చేసి రూల్ 7కు ప్రొవిజన్ జోడించడం సరైంది కాదని బీఈడీ అభ్యర్థులు కోర్టు దృష్టికి...